*చలన సూత్రం*

ఎదగడమెంత కష్టమో !

ఏడంతస్తుల మేడ ఎక్కడమంత.
అంతా అడుగుల బలమే

దిగజారడమెంత సులువో !
ఏడంతస్తుల మేడ దిగడమంత .
అంతా చేతల ఫలమే 
 
ఎక్కుతూ ఎక్కుతూ
మెట్లమీద సంతకాలు చేయడం 
నీ కోరిక !

దిగుతూ  దిగుతూ  
ప్రతి సంతకాన్నీ చెరిపివేయడం   
నీకు సరదా !!

--పారువెల్ల

Back to Top