'మా' ఎన్నికల్లో నరేశ్ ప్యానల్ అద్భుత విజయం
- March 11, 2019
హైదరాబాద్:ఉత్కంఠభరితంగా సాగిన తెలుగు సినీ నటుల సంఘం మా ఎన్నికల్లో నరేశ్ ప్యానల్ అద్భుత విజయం సాధించింది. అధ్యక్షుడిగా నరేశ్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ రాజు, శివ బాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందడం విశేషం.
మా ఎన్నికల్లో నరేశ్, శివాజీ రాజా ప్యానళ్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. మాలో మొత్తం 745 ఓట్లు ఉండగా, 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నికలకు ఈవీఎంలను ఉపయోగించగా, ఈసారి బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







