సలాలా ఎయిర్‌పోర్ట్‌లో సేవల పునఃప్రారంభం
- March 11, 2019
మస్కట్:సలాలా ఎయిర్‌పోర్ట్‌లో సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 2 గంటల నుంచి సేవల్ని తిరిగి ప్రారంభించినట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ వెల్లడించింది. ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం టైరు పేలడంతో, రన్‌వేపై అది నిలిచిపోగా, ఎయిర్‌పోర్ట్‌లో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో సలాలా విమానాశ్రయానికి వచ్చే విమానాలు ప్రత్యామ్నాయ విమానాశ్రయాల వైపు మళ్ళాయి. తిరిగి సేవలు ప్రారంభం కావడం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాతాలికంగా ఏర్పడ్డ సమస్యతో ప్రయాణీకులు కొంత ఇబ్బంది పడ్డారు. విమానాల ఆలస్యానికి చింతిస్తున్నట్లు అధికారులఱు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







