సౌదీ అరేబియా:బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లోనే మరచిపోయి విమానమెక్కిన తల్లి!
- March 12, 2019
సౌదీ అరేబియా: విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఏదో సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ అయిన విమానం నిమిషాల్లోనే తిరిగి దిగడం సాధారణమే. అయితే సౌదీ అరేబియాలోని జెడ్డా ఎయిర్‌పోర్ట్‌లో ఇలాగే ఓ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఎందుకో తెలుసా.. ఆ విమానంలోని ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లోనే మరచిపోయి విమానమెక్కింది. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి తిప్పాలని అనుకుంటున్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులకు విమాన సిబ్బంది సమాచారమిచ్చారు. సాధారణంగా ఎమర్జెన్సీ సమయాల్లోనే ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చే ఎయిర్‌పోర్ట్‌లు ఈ విషయంలో ఏం చేయాలో తెలియక కాసేపు అయోమయానికి గురయ్యాయి. ఈ విమానం తిరిగి రావడానికి అనుమతివ్వాలని కోరుతోంది. ఎందుకంటే ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లోనే మరచిపోయింది. మేము తిరిగి రావాలా వద్దా అని పైలట్ ఏటీసీని అడిగాడు. అయిలే పైలట్ ఏం చెప్పాడో అర్థం కాక..
సరైన కారణమేంటో మరోసారి చెప్పు అని ఆ ఆపరేటర్ ప్రశ్నించాడు. దీనికి మరోసారి పైలట్ నుంచి అదే సమాధానం వచ్చింది. దీంతో మరో దారి లేక విమానం తిరిగి రావడానికి ఏటీసీ అనుమతినిచ్చింది. విమానం దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆ బిడ్డను తల్లికి అప్పగించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..