రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
- March 12, 2019
15 నుంచి 16 ఏళ్ళ మధ్యనున్న నలుగురు టీనేజర్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రస్ అల్ ఖైమాలోని మౌంటెయిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్ టీమ్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, మరీ ముఖ్యంగా యువకులు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







