రూట్ ఎక్స్‌టెన్షన్‌ని ప్రకటించిన మవసలాట్
- March 13, 2019
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ (మవసలాట్), రూట్ నెంబర్ 7 ఎక్స్‌టెన్షన్‌ని ప్రకటించింది. అల్ మబైలా నుంచి బుర్స్ అసాహ్వాకి అల్ ఖౌద్ మీదుగా ఈ రూట్ వుంటుంది. అల్ మబైలా - అల్ కౌద్ బుర్స్ అల్ సహ్వాగా ఈ రూట్‌ని పిలుస్తారు. మార్చి 15 నుంచి ఈ రూట్ అందుబాటులోకి వస్తుంది. మస్కట్ గవర్నరేట్‌లో సేవల విస్తరణలో భాగంగా ఈ రూట్‌ని కొత్తగా ప్రకటించినట్లు మవసలాట్ పేర్కొంది. కొత్త రూట్ సెవన్ అల్ మాబిలా నుంచి ప్రారంభమయి అల్ మాబిలా ఇండస్ట్రియల్ ఏరియా, ట్రాఫిక్ లైట్స్ అల్ మాబిలా, నెస్ట్రో హైపర్ మార్కెట్, యాస్ షాపింగ్ సెంటర్, అల్ నది రౌండెబౌట్, అల్ ఖోద్ పార్క్, అల్ హయిల్ రౌండెబౌట్, మస్కట్ సిటీ సెంటర్ మీదుగాఆ బుర్జ్ అసహ్వా వెళ్ళి, తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్‌లో అల్ మాబిలా చేరుకుంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







