చైనా తీరు మారలేదు..అజర్ ను మళ్ళీ వెనకేసుకొస్తున్న చైనా
- March 14, 2019
బీజింగ్: మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను మరోసారి అడ్డుకున్న చైనా.. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ అంశంలో మరింత లోతైన విచారణ చేపట్టడానికి ఇంకా సమయం కావాలని చైనా చెప్పడం గమనార్హం. అదే సమయంలో తాము ఇండియాతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని, ఇలాంటి అంశాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసమే తాము చూస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ వివరించారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని ఎందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నించగా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీకి వచ్చే ప్రతి దరఖాస్తునూ చైనా క్షుణ్నంగా, లోతుగా పరిశీలిస్తుందని, దీనికి మరింత సమయం కావాలని లూ కాంగ్ చెప్పారు. ఓ వ్యక్తి లేదా సంస్థపై ఉగ్రవాద ముద్ర వేయడానికి భద్రతా మండలి ఆంక్షల కమిటీకి కొన్ని ప్రామాణికాలు, ప్రక్రియలు ఉన్నాయి. వాటిపై చైనా పూర్తిగా అధ్యయనం చేస్తుంది. అందుకే మేము ఈ అంశాన్ని సాంకేతికంగా నిలిపి ఉంచామని లూ కాంగ్ వెల్లడించారు. ఈ ప్రాంత సుస్థిరత, శాంతికి చైనా బాధ్యతయుతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇండియా, చైనా సంబంధాలపై ప్రశ్నించగా.. ఇప్పటికే జీ జిన్‌పింగ్, మోదీ గతేడాది నాలుగుసార్లు భేటీలు నిర్వహించారని, రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







