రాజమౌళి చెప్పిన 'RRR' కథ
- March 14, 2019

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు రాజమౌళి. దీంతో రాజమౌళి తరువాత తీసే సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. రాజమౌళి ప్రస్తుత తెలుగులో ఓ భారీ మల్టీ స్టారర్‌కు తెరలేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్ , రామ్ చరణ్‌ను హీరోలుగా పెట్టి 'RRR'అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్ , రామ్ చరణ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ముందుగా సినిమాలోని ఫైట్స్‌ను షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సబంధించి మీడియా సమావేశం పెట్టారు రాజమౌళి. సినిమా కథ గురించి మొదటిసారి మీడియాతో మాట్లాడారు రాజమౌళి. ఇది 1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని చెప్పారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్టెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నామని తెలిపారు రాజమౌళి. తాను తీసిన అన్ని సినిమా కథలను ముందుగానే మీడియాతో పంచుకునే అలవాటు ఉంది, దీనిలో భాగంగానే ఈ సినిమా కథను కూడా మీతో పంచుకోవాడానికి వచ్చానని తెలిపారు రాజమౌళి.
ఈ సినిమా కథను కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత కథల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమా చేస్తున్నానని ప్రకటించారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్లను ఎంపిక చేయలేదు. మార్కెట్ దృష్ట్యా బాలీవుడ్ హీరోయిన్స్‌ను తీసుకుందమని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పరిణితి చోప్రా, అలియా భట్‌లను ఈ సినిమాలో హీరోయిన్స్‌కు తీసుకునే ఆలోచనట చేస్తున్నాడట రాజమౌళి. సినిమాను 2020 చివర్లో విడుదల చేస్తారని సమాచారం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







