మిడిల్‌ ఈస్ట్‌లో అతి పెద్ద అక్వేరియం త్వరలో ప్రారంభం

మిడిల్‌ ఈస్ట్‌లో అతి పెద్ద అక్వేరియం త్వరలో ప్రారంభం

మస్కట్‌: మిడిల్‌ ఈస్ట్‌లో అతి పెద్దదైన అక్వేరియం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఒమన్‌ ఆక్వేరియం ప్రిల్‌ 15న మాల్‌ ఆఫ్‌ మస్కట్‌ వద్ద ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. మాల్‌ ఆఫ్‌ మస్కట్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, 15న ప్రారంభోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సుల్తానేట్‌లో తొలి పబ్లిక్‌ అక్వేరియం ఇదేననీ, మిడిల్‌ ఈస్ట్‌లో ఇదే అతిపెద్ద ఆక్వేరియం అనీ అధికారులు చెబుతున్నారు. మాల్‌ ఆఫ్‌ మస్కట్‌కి ఈ ఒమన్‌ ఆక్వేరియం మెయిన్‌ హైలైట్‌ కానుంది. 8000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. మూడు ఫ్లోర్స్‌తో, డెమీ టన్నెల్‌తో దీన్ని ఏర్పాటు చేశారు. 30,000 మెరైన్‌ యానిమల్స్‌, 1000 రకాలైన చేపలతో అక్వేరియంని రూపొందించారు. 

 

Back to Top