తప్పిపోయిన జోర్డానియన్ బాలిక ఆచూకీ గుర్తింపు
- March 16, 2019
కువైట్: తప్పిపోయిన జోర్డానియన్ బాలికను సెక్యూరిటీ ఫోర్సెస్ గుర్తించాయి. తన కుమార్తె కన్పించడంలేదంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ బాలిక, తన బాయ్‌ఫ్రెండ్‌తో వున్నట్లు పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం ప్రార్థనల కోసం తన తండ్రి వెళ్ళగా ఆ సమయంలో బాలిక, తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఇతర కుటుంబ సభ్యుల్ని వుంచి, కుటుంబ పెద్ద అయిన తండ్రి మసీదుకు వెళ్ళారు. మరోపక్క, ఇతర కుటుంబ సభ్యులు మార్కెట్‌కి వెళ్ళగా కారులో ఒంటరిగా వుండిపోయిన బాలిక, ఆ తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోవడం జరిగింది. బాలికనీ, ఆమె బాయ్ఫ్రెండ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









