మోడీ మెచ్చిన హైదరాబాదీ
- March 18, 2019
హైదరాబాద్: మై భీ.. చౌకీదార్ నినాదాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నందుకు ఖైరతాబాద్ బీజేపీని సాక్షాత్తు దేశ ప్రధాని ట్విటర్ ద్వారా అభినందించారు. నారాయణగూడకు చెందిన కేశబోయిన శ్రీధర్ బీజేపీలో సీనియర్ నాయకుడు. సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించే ఆయన పార్టీ కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు.
ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మై భీ చౌకీదార్ నినాదాన్ని అందుకున్నారు. పార్టీ శ్రేణులందరూ ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ నినాదాన్ని శ్రీధర్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల దృష్టికి విస్తృతంగా తీసుకెళ్తున్నట్టు గమనించిన ప్రధాని ట్విటర్ ద్వారా శ్రీధర్‌ను అభినందించారు. ప్రధాని అభినందించడం సంతోషంగా ఉందని, సామాన్య కార్యకర్తల కష్టాన్ని కూడా ప్రధాని గుర్తిస్తారనే దానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







