పారికర్ మృతి...తదుపరి సీఎంపై కొనసాగుతున్న చర్చలు
- March 18, 2019
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూయడంతో కొత్త సీఎం ఎవరన్న దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి చేరుకున్నారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు జరిపారు. కానీ సమావేశంలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని డిప్యూటీ స్పీకర్ మైకేల్ లోబో తెలిపారు. సంకీర్ణ పక్షమైన మహారాష్ట్రవాదీ గోమంటక్ పార్టీ నేత సుదిన్ ధావలికర్ తననే సీఎం చేయాలని పట్టుబడుతున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్‌దేశాయ్ కూడా భాజపా అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ''సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను వారితో చర్చించాం. అయితే ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. మా ప్రతిపాదనలు వారి ముందు ఉంచాం. వాటిపై వారు స్పందించాల్సి ఉంది. మా పార్టీ ఇంతకాలం మనోహర్ పారికర్‌కు మద్దతు పలికింది. భాజపాకు కాదు'' అని సర్‌దేశాయ్ వివరించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భాజపాకు సొంతంగా 12 మంది శాసనసభ్యులుండగా మిత్రపక్షాలతో కలిపి 20 మంది బలం ఉంది. 14 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







