జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ

జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ

పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. జనసేనలో అధికారికంగా చేరబోతున్నారు. జనసేనకు మద్దతుగా మొదటి నుంచి బలంగా వాయిస్ వినిపిస్తున్న నాగబాబు.. ఆ మధ్య పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. ఇకఇప్పుడు బరిలోకి దిగి పోటీ చేస్తారని తెలుస్తోంది. నరసాపురం ఎంపీగా ఆయన నిలబడతారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ భీమవరం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య నాగబాబు.. నరసాపురం లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో.. జనసేన క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Back to Top