ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. పొదుపుతో పాటు భద్రత కూడా..

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. పొదుపుతో పాటు భద్రత కూడా..

ప్రభుత్వ రంగానికి చెందిన బీమా సంస్థ ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం ఓ కొత్త పాలసీ తీసుకు వచ్చింది. నవజీవన్ పేరుతో వచ్చిన ఈ పాలసీ రక్షణతో పాటు ఆదాయాన్ని అందిస్తుంది. 90 రోజులు ఉన్న పిల్లల నుంచి 65 సంవత్సరాల వృద్ధుల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం ఒకేసారి కట్టవచ్చు లేదా ఐదేళ్ల వరకు ప్రీమియం చెల్లించే వెసులు బాటు కల్పించింది సంస్థ. ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు. పన్ను రాయితీని కూడా అందిస్తుంది. హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయంలో రీజినల్ జోనల్ మేనేజర్ (మార్కెటింగ్) జగన్నాథ్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో జోనల్ మేనేజర్ (ఇన్‌చార్జ్) వినోద కుమారి ఈ పాలసీని మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ పాలసీని ప్రారంభించిన రోజునే దేశవ్యాప్తంగా మూడు వేల మంది తీసుకోగా, సౌత్ సెంట్రల్ జోన్‌లో 700 మంది తీసుకున్నట్లు ఎల్‌ఐసీ అధికారులు తెలిపారు.

 

Back to Top