ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు.. జీతం. రూ.80,000.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు.. జీతం. రూ.80,000.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. జూన్‌లో నిర్వహించే యూజీసీ నెట్‌లో వచ్చిన మార్కులు,ఇంటర్వ్యూ, విద్యార్హతల ప్రామాణికంగా నియామకాలు చేపడతారు.
పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు: 23
హ్యూమన్ రిసోర్స్ (హెచ్ఆర్) ఎగ్జిక్యూటివ్: 20
అర్హత: 60 శాతం మార్కులతో ఎంబీఏ (పర్సనల్ మేనేజ్‌మెంట్/ హెచ్‌ఆర్‌డీ/హెచ్‌ఆర్‌ఎం) లేదా పీజీ డిగ్రీ (పర్సనల్ మేనేజ్‌మెంట్/ఐఆర్/లేబర్ వెల్ఫేర్) లేదా రెండేళ్ల పీజీ
డిప్లొమా (పర్సనల్ మేనేజ్‌మెంట్/ఐఆర్/లేబర్ వెల్ఫేర్) లేదా ఐఐఎం నుంచి పీజీడీఎం.
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 03
అర్హత: 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ/డిప్లొమా (పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు యూజీసీ నెట్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితితో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: అభ్యర్థులకు మొత్తం 100 మార్కులను ప్రామాణికంగా నిర్ణయించారు. ఇందులో యూజీసీ నెట్ 2019 స్కోరుకు 60 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకు 15
మార్కులు, విద్యార్హతలకు 25 మార్కులు కేటాయించారు.
పేస్కేలు: రూ.60,000 – రూ.80,000
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.03.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.04.2019
ఇంటర్వ్యూ షెడ్యూలు: ఆగస్టులో
యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూలు..
యూజీసీ దరఖాస్తు ప్రారంభం: 01.03.2019
యూజీసీ దరఖాస్తుకు చివరి తేదీ: 30.03.2019
యూజీసీ నెట్-2019 పరీక్షతేదీ: జూన్ 20-28 వరకు. 
వెబ్‌సైట్: https://www.ongcindia.com

Back to Top