నకిలీ వీసాలను అమాయకులకు అంటగడుతున్న కంత్రీగాళ్లు
- March 21, 2019
హైదరాబాద్: ఉపాధి అవకాశాల పేరుతో నకిలీ వీసాలు, పాస్ పోర్టులను అమాయకులకు అంటగడుతున్న కంత్రీగాళ్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. 18 మంది ఏజెంట్లను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా ఏపీ, తెలంగాణకు చెందినవారిగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది.
పోలీసులకు పట్టుబడిన వారిలో గల్ఫ్ ఎయిర్‌లైన్స్, ఒమన్ ఎయిర్ లైన్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈముఠాకు సహకరించిన చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న మధుని కూడా అరెస్ట్ చేశారు. ఎంప్లాయి మెంట్, టూరిస్ట్ వీసాలను సృష్టించి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్… ఈగ్యాంగ్ సహాయంతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు సజ్జనార్. రూల్స్ పాటిస్తున్న ఏజంట్లను మాత్రమే నమ్మాలని.. మాయమాటలకు మోసపోవద్దని సీపీ సజ్జనార్ సూచించారు.
తోట మణికంఠ గ్యాంగ్ , పుష్ప గ్యాంగ్ రెండు ముఠాలు గా గత కొంత కాలంగా అక్రమ రవాణా చేస్తున్నారు. నకిలీ వీసా, పాస్ పోర్టులను సృష్టించి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు 50మందికి పైగా నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తూ పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగి ఏజెంట్ల ఆట కట్టించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







