ట్రాఫిక్ జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్
- March 22, 2019
దుబాయ్ పోలీస్, వాహనదారులకు గుడ్ న్యూస్ అందించారు. ఇయర్ ఆఫ్ టోలరెన్స్‌లో భాగంగా 100 శాతం వకు ట్రాఫిక్ ఫైన్స్‌పై రిడక్షన్ పొందేందుకు వీలుంది. గత 12 నెలల్లో ఉల్లంఘనలకు పాల్పడినవారికి ఉపశమనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి డిస్కౌంట్‌ని 25 శాతంగా నిర్ణయించారు. మే నెలలో దీన్ని జారీ చేస్తారు. ఆరు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా వుంటే 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. నవంబర్ వరకు ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో 75 శాతం, వచ్చే ఏడాది జనవరి వరకు ఉల్లంఘనల జోలికి వెళ్ళకపోతే 100 శాతం ఉపశమనం పొందడానికి వీలుంటుంది. ఇదిలా వుంటే ఉమ్ అల్ కువైన్ కూడా 50 శాతం ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్‌ని వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ప్రకటించిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..