'పీఎం కిసాన్' రెండోవిడత ఆర్థికసాయం!
- March 24, 2019
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండో విడత నగదు బదిలీ ఏప్రిల్ 1 నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 10న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఈ పథకం కింద 4.74 కోట్ల మంది చిన్న,సన్నకారు రైతులను ఎంపిక చేశారు. ఇప్పటికే 2.74 కోట్ల మంది ఖాతాల్లో తొలివిడతగా రూ.2000 చొప్పున జమచేశారు. మిగతావారి ఖాతాల్లోనూ ఈనెలాఖరులోగా నగదు జమ చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈప్రక్రియను కొనసాగించేందుకు ఈసీ నుంచీ అనుమతులొచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం ద్వారా అత్యధిక సంఖ్యలో రైతులు లబ్ధిపొందుతున్న తొలి 3 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఉన్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







