ఘనంగా వెంకటేష్ కూతురి వివాహం
- March 24, 2019టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహం వినాయక్ రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది. జైపూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వేడుకకు టాలీవుడ్ హీరో రాంచరణ్ దంపతులు, హీరో రానా అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఆదివారం ఉదయం జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను రాంచరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేశారు.
వధూవరులతో పాటు వెంకటేష్ దంపతులతో కలిసి చరణ్ ఉపాసన దిగిన ఫోటో అలాగే హీరో రానా తో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన పోస్ట్ చేశారు. కాగా వరుడు వినాయక్ రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు. దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్‌లో రిసెప‍్షన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్