వెదర్ అప్‌డేట్: ఈ వారంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం
- March 25, 2019
యూఏఈ రెసిడెంట్స్ ఈ వారంలో భారీ వర్షాల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఈ రోజు వాతావరణం పాక్షికంగా మేఘావృతమయి వుంటుంది. గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్లుగా వుండొచ్చు. విజిబిలిటీ ఇంటర్నల్ నార్తరన్ ప్రాంతాల్లో 2000 మీటర్లకు తగ్గుతుందని ఎన్‌సిఎం వివరించింది. అరేబియన్ గల్ఫ్ సముద్రం చాలా రఫ్‌గా వుంటుంది. ఒమన్ సముద్రం కూడా రఫ్‌గా వుంటుంది. మంగళవారం కూడా ఆకాశం మేఘావృతమై వుంటుంది, అక్కడక్కడా వర్షం కురిసే అవకాశాలున్నాయి. పలు ప్రాంతాల్లో వడగళ్ళు పడే ప్రమాదం లేకపోలేదు. ఆదివారం అబుదాబీ, అల్ అయిన్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ కువైన్, రస్ అల్ ఖైమా, ఫుజారియా ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడా ఇబ్బందులు ఏర్పడినట్లు రిపోర్ట్స్ అందుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







