66 ఏళ్ళ వృద్ధుడికి ఇండియన్‌ కమ్యూనిటీ సాయం

- March 27, 2019 , by Maagulf
66 ఏళ్ళ వృద్ధుడికి ఇండియన్‌ కమ్యూనిటీ సాయం

66 ఏళ్ళ సురేంద్ర నాథ్‌ ఖన్నా, యూఏఈకి తన కుమారుడ్ని కలిసేందుకు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఖన్నా ట్రావెల్‌ లేదా మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ లేకపోవడంతో హాస్పిటల్‌ బిల్స్‌ 100,000 దిర్హామ్‌లకి చేరుకుంది. ఎయిర్‌ అంబులెన్స్‌ కోసం అప్పు చేసినా, పోర్టబుల్‌ వెంటిలేటర్‌ సరిపోని కారణంగా అదీ కుదరలేదు. దానికోసం వెచ్చించిన సొమ్ము కూడా వృధా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కమ్యూనిటీ ఆయనకు సహాయంగా ముందుకొచ్చింది. ఎట్టకేలకు బాధితుడి కుమారుడు తన తండ్రిని తరలించేందుకు అవసరమైన ఎయిర్‌ అంబులెన్స్‌ని సమకూర్చుకోగలిగారు. మరోపక్క బాధిత వ్యక్తికి వైద్య చికిత్స అందిస్తోన్న ఎన్‌ఎంసి హాస్పిటల్‌ సైతం బిల్లింగ్‌ సైకిల్‌ని కొద్ది రోజులపాటు ఆపి, పేమెంట్‌ పీరియడ్‌ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా వుందని అనుభవ్‌ చెప్పారు. కాగా, యాక్టింగ్‌ కాన్సుల్‌ జనరల్‌ నీరజ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, ఎన్‌ఎంసి హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్‌ కమ్యూనిటీ మెంబర్స్‌ సకాలంలో సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com