ఫేస్బుక్ చేసిన పొరపాటు
- March 28, 2019
పుల్వామా ఘటన తర్వాత కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా... పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య వివాదాలకు కారణం అవుతున్న కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఫేస్బుక్ చేసిన తప్పును నెటిజన్లు ఏకిపారేశారు. ఇరాన్ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన దేశాలను ప్రస్తావిస్తూ ఓ బ్లాగ్ పోస్టులో పెట్టిన జాబితాలో ఈ పొరపాటు చోటుచేసుకుంది. ఇవాళ ఇరాన్ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన 513పేజ్‌లను, గ్రూపులను ఫేస్బుక్ పాలసీలకు అనుగుణంగా తీసేశామంటూ ఫస్‌బుక్ బ్లాగ్‌లో వెల్లడించింది. ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియాలతోపాటు కశ్మీర్‌ను సదరు దేశాల జాబితాలో చేర్చిన ఫేస్బుక్.. నెటిజన్లు అలర్ట్ చేయడంతో తప్పును గుర్తించి క్షమించండి పొరపాటు జరిగింది అంటూ క్షమాపణలు చెప్పింది. అలాగే ఇరాన్, రష్యా, మకెడోనియాలలో 2,632 పేజ్‌లను, గ్రూపులను ఫేస్బుక్ రిమూవ్ చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







