హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు

- March 28, 2019 , by Maagulf
హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు

దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్‌ కు తీవ్ర గాయాలయాయ్యి. ప్రస్త్తుతం సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం టర్కీలో షూటింగ్‌ జరుగుతోంది. ఫైట్‌ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న విశాల్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో విశాల్‌ కాలు, చేయి విరిగినట్లు తెలుస్తోంది. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్‌ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆయనకు నెల్లూరు కు చెందిన అమ్మాయి అనీశాతో నిశ్చితార్థం అయింది. వీరి వివాహం సెప్టెంబరులో జరగనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com