దుబాయ్ గ్లోబల్ విలేజ్‌ని సందర్శించిన షేక్ మహమ్మద్
- December 30, 2015
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్‌ని సందర్శించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు, అభివృద్ధికి కేంద్రంగా మారిన గ్లోబల్ విలేజ్‌లో భాగస్వాములైన కంపెనీల ప్రతినిథులతో మహమ్మద్ మాట్లాడారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ మరియు హాస్పిటాలటీ ఇన్ దుబాయ్ డైరెక్టర్ జనరల్ ఖలీఫా సయీద్ సులేమాన్, షేక్ మహమ్మద్ వెంట గ్లోబల్ విలేజ్‌లో పర్యటించారు. ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్‌కి సంబంధించిన పెవిలియన్‌నీ, అలాగే సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, ఈజిప్ట్ మరియు చైనా దేశాలకు చెందిన పెవిలియన్‌లను సందర్శించారు షేక్ మహమ్మద్. యూఏఈ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ప్రభుత్వం మరియు ప్రజలు వివిధ దేశాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించడం, అలాగే వివిధ దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండడం గొప్ప విషయమని కొనియాడారు. గ్లోబల్ విలేజ్ దుబాయ్‌కి చెందిన చారిత్రాత్మక షాపింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రంగా వర్దిల్లుతోంది. వివిధ దేశాలకు సంబంధించిన సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతాయి. ఈ షాపింగ్ కోసమే వివిధ దేశాల నుంచి పెద్దయెత్తున సందర్శకులు కూడా రావడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









