వాట్సప్‌లో త్వరలో రానున్న కొత్త ఫీచర్లు
- March 30, 2019
వాట్సప్‌లో త్వరలో కొత్త ఫీచర్లు రానున్నాయి. ఇప్పటికే వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వాయిస్ మెసేజెస్, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్, డార్క్ మోడ్‌పై వాట్సప్ బీటా టెస్టింగ్ చేస్తోంది. వాట్సప్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వాయిస్ మెసేజెస్‌కి అదనంగా... ఒకటి కంటే ఎక్కువ వాయిస్ మెసేజ్‌లను వరుసగా ప్లే చేసుకునే సదుపాయాన్ని త్వరలో వాట్సప్ తీసుకురానుంది. ఒకదాని తర్వాత మరోటి ప్లే చేయాలనుకున్నా... ఒకేసారి అన్ని ఆడియో క్లిప్స్ ప్లే చేయాలనుకున్నా ఈ ఫీచర్ ద్వారా చేసుకోవచ్చని.. యూజర్లు ఆడియో క్లిప్ ప్లే బటన్ మీద నొక్కాల్సిన అవసరం లేదని వాట్సప్ వెల్లడించింది. దాని తర్వాత మరో ఫీచర్ పిక్చర్ ఇన్ పిక్చర్(పీఐపీ) మోడ్‌లోనూ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. పీఐపీ ఫీచర్ ప్రకారం... యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను వాట్సప్‌లోనే ప్లే చేసుకోవచ్చు. అయితే.. ప్రస్తుతం ఉన్న ఫీచర్‌లో వాట్సప్ యాప్ ఓపెన్‌లో ఉంటేనే ఆ వీడియోలను చూసే వెసులుబాటు ఉంది.
వాట్సప్ యాప్‌ను క్లోజ్ చేస్తే వీడియో కూడా ప్లే అవదు. కానీ.. కొత్తగా వచ్చే ఫీచర్ ద్వారా వాట్సప్ యాప్‌ను క్లోజ్ చేసినా సరే.. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూనే ఉంటుంది.
డార్క్ మోడ్‌పై కూడా వాట్సప్ వర్క్ చేస్తోంది. వాట్సప్‌బీటాఇన్ఫో డార్క్ మోడ్‌కు సంబంధించి ఫోటోలను షేర్ చేసింది. వాట్సప్ సెట్టింగ్ మెనులోకి వెళ్లి డార్క్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్‌పై ఇదివరకే బీటా అప్‌డేట్‌లో వాట్సప్ టెస్ట్ చేసింది.
ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్‌లో డార్క్ మోడ్ కోసం వాట్సప్ టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా.. బ్యాక్‌గ్రౌండ్ నలుపు రంగులో ఉండి.. ఇతర ఐకాన్స్ అన్నీ గ్రీన్ కలర్‌లో ఉంటాయి.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలో బీటా వర్షన్‌లో వాట్సప్ టెస్టింగ్ నిర్వహిస్తోంది. కొన్ని ఫీచర్లకు కొంతమంది యూజర్లకు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. అవి వాట్సప్ బీటా వర్సన్‌లో టెస్ట్ చేసేవే. ఈ కొత్త ఫీచర్లన్నీ ఎప్పుడు అందరు యూజర్లకు అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని మాత్రం వాట్సప్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..