`బ్రోచేవారెవరురా`లో నివేదా థామస్ లుక్
- March 30, 2019
`బ్రోచేవారెవరురా`... టైటిల్‌తోనే ఆకట్టుకున్న సినిమా. ఈ సినిమాలో తన పాత్ర గురించి నివేదా థామస్ ఆ మధ్య గొప్పగా చెప్పడంతో సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో హీరో లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా హీరోయిన్ లుక్‌ను ఆవిష్కరించింది. ఈ స్టిల్‌లో మలయాళీ బ్యూటీ నివేదా థామస్ క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో ఆకట్టుకుంటున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ స్టిల్ బావుందని మెచ్చుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రం `బ్రోచేవారెవరురా`. `చలనమే చిత్రము, చిత్రమే చలనము` అనే ట్యాగ్‌లైన్ టైటిల్‌కు అదనపు ఆకర్షణ. సత్యదేవ్, నివేదా పెతురాజ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సపోర్టింగ్ పాత్రలతో మెప్పిస్తారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. `బ్రోచేవారెవరురా` షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
నటీనటులు:
శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేదా పెతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత: విజయ్ కుమార్ మన్యం
సంస్థ: మన్యం ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
కెమెరా: సాయి శ్రీరామ్
ఎడిటర్: రవితేజ గిరిజాల
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..