సినిమాలే తర్వాతే హానీమూన్ అంటున్న ఆర్య భార్య
- March 31, 2019
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సాయేషా సైగల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలవడంతో తెలుగులో మళ్లీ ఈ భామకు అవకాశం రాలేదు. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో సినిమా చేస్తు ఫుల్ బిజీ హీరోయిన్గా మారింది. ఇదే సమయంలో తమిళ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సాయేషా సైగల్. ఆర్య - సాయేషా సైగల్ పెళ్లి ఘనంగా జరిగింది. తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ, బాలీవుడ్ ప్రముఖులు కూడా వీరి పెళ్లికి హాజరైయ్యారు.
పెళ్లి కారణంగా సాయేషా తాను నటిస్తున్న సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. పెళ్లి కారణంగా విరామం తీసుకున్న సాయేషా తిరిగి మళ్లీ తన సినిమా షూటింగ్లో పాల్గొంది. తొలిసారిగా కన్నడలో ఆమె పునీత్ రాజ్ కుమార్ సరసన 'యువరత్న' సినిమాలో నటిస్తోంది. బెంగుళూరులో జరుగుతోన్న షూటింగులో ఆమె జాయిన్ అయింది. ఈ సినిమాతో పాటు రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది. సినిమా షూటింగ్ ఇబ్బంది కలుగకూడదని భావించిన సాయేషా తమ హానీమూన్ని కూడా వాయిదా వేసుకుంది. సినిమాల ఒత్తిడి తీరిన తరువాత తన హానీమూన్ని ప్లాన్ చేసుకోనుంది ఈ భామ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..