హౌతీ డ్రోన్ల కూల్చివేత: ఐదుగురికి గాయాలు

- April 03, 2019 , by Maagulf
హౌతీ డ్రోన్ల కూల్చివేత: ఐదుగురికి గాయాలు

రియాద్‌: హౌతీ ద్రోన్ల ద్వారా దాడులకు యెమెన్‌ తీవ్రవాదులు ప్రయత్నించగా, సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ చాకచక్యంగా ఈ దాడుల్ని తిప్పికొట్టాయి. అయితే ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఓ చిన్నారి వున్నారు. జనావాసాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. శకలాలు జనావాసాల్లో కూలడంతో స్వల్పంగా కొందరికి గాయాలయినట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com