రామ్ చరణ్‌కు గాయం.. షూటింగ్ వాయిదా
- April 03, 2019
దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి.. బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే ఈ షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. జిమ్‌లో కసరత్తు చేస్తుండగా.. రామ్‌చరణ్ మడిమ భాగంలో గాయం కావడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్ఆర్ బృందం తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ''నిన్న జిమ్‌లో కసరత్తు చేస్తుండగా.. రామ్‌చరణ్ మడిమ భాగంలో స్వల్పగాయమైనట్లు తెలుపుటకు చింతిస్తున్నాము. దీనితో పూణె షెడ్యూల్‌ని రద్దు చేశాము. మూడు వారాల తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభిస్తాము'' అని ఆర్‌ఆర్‌ఆర్ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..