వరల్డ్ మ్యాప్‌లను ధ్వంసం చేస్తున్న చైనా
- April 04, 2019
ఉరుమురుమి మంగళం మీద పడ్డట్లుగా తయారైంది ప్రపంచ పటాల పరిస్థితి. చైనా కోపం వరల్డ్ మ్యాప్‌లకు ముప్పు తెచ్చి పెట్టింది. ప్రపంచ పటాలపై చైనాకు ఎందు కంత కోపం అనేదే మీ డౌట్ కదా! అదంతే. చైనాకు కోపమొస్తే వరల్డ్ మ్యాప్‌లు కూడా మాడి మసి కావాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. గత నెలలో 30 వేల ప్రపంచ పటాలను నాశనం చేసిన చైనా, ఇప్పుడు ఏకంగా 3 లక్షల ప్రపంచ పటాలను ధ్వంసం చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఆదేశించడంతో అధికార యంత్రాంగం మొత్తం వరల్డ్ మ్యాప్‌లు తొలగించడంపై దృష్టి సారించింది.
ఇంతకీ ప్రపంచ పటాలపై చైనాకు ఎందుకంత మంట అంటే… ఇతర దేశాల భూభాగాలను తనవిగా చెప్పుకోవడం చైనాకు అలవాటు. మనదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు టిబెట్, తైవాన్ సహా పలు ప్రాంతాలను తమ భూభాగా లుగా చైనా ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. దాంతో భౌగోళిక సరిహద్దుల విషయంలో పరిసర దేశాలతో వివా దాలు నడుస్తున్నాయి. ఫలితంగా చైనా అధికారులు ప్రభుత్వ సూచనల మేరకు మ్యాప్‌లను ఎప్పటికప్పుడు పరిశీ లించి మార్పులు-చేర్పులు చేస్తూ ఉంటారు. తాజాగా గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని వెంజిండు పోర్టులో భారీగా ప్రపంచ పటాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెదర్లాండ్స్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన ఆ మ్యాప్‌ల ను పరిశీలిస్తే, అందులో అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగంగా ఉండగా, తైవాన్ స్వతంత్ర దేశంగా ఉంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు మ్యాప్‌లను ముద్రించిన సంస్థపై దాడి చేశారు.
చైనా అధికారులు మొత్తం 3 లక్షల 6 వేల మ్యాప్‌లను గుర్తించారు. ఆ పటాలు, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఉండడంతో వెంటనే ధ్వంసం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రపంచ పటాలను ముద్రించిన సంస్థపై దావా వేయాలని నిర్ణయించారు. మార్చ్ నెలలో క్వింగ్డో పట్టణంలోని ఓ కంపెనీపై దాడి చేసిన కస్టమ్స్ అధికారులు సుమారు 29 వేల మ్యాప్‌లను ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..