యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ పై , ప్రతీకార దాడులకు కుట్ర చేస్తున్న నిందితుడి అరెస్ట్
- December 30, 2015
గత ఏడాది అబుదాబీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అమెరికా కు చెందిన ఒక వ్యక్తిని హత్య చేసిన మహిళకు ఉరి వేయబడిన సంగతి స్థానికులకు విధితమే. కాగా , ఉరి వేయబడిన మహిళ భర్త ప్రతీకారంతో యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ పై దాడులకు కుట్ర చేస్తూ పోలీసులకు దోరికిపోయినట్లు స్థానిక వార్తాపత్రిక ఓ సంచలన కధనం ప్రచురించింది. అదుపులో తీసుకొన్న నిందితుడు విదేశీ పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సులపై , అమెరికా సైనిక స్థావరాలపై బాంబు దాడులకు ప్రణాళిక సిద్దం చేసుకొన్నట్లు ఆ పత్రిక తెలిపింది. అంతే కాక , యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ కు చెందిన ఒక నాయకుడిని దారుణంగా హత్య చేసేందుకు కుట్ర సైతం చేసినట్లు వివరించింది. అనుమతి లేకుండా ప్రమాదకర పేలుడు
పదార్ధాలను కల్గి ఉన్నాడని, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు భారీ ఎత్తున డబ్బులను ఇచ్చినట్లు ఆ వార్తా కధనంలో పేర్కొంది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









