చిరంజీవి టైటిల్స్ అన్యాక్రాంతం..మెగా కాంపౌండ్ అసహనం !

- April 08, 2019 , by Maagulf
చిరంజీవి టైటిల్స్ అన్యాక్రాంతం..మెగా కాంపౌండ్ అసహనం !

150 సినిమాలకు పైగా నటించిన చిరంజీవి సూపర్ హిట్ మూవీల టైటిల్స్ ముట్టుకోవడానికి మెగా యంగ్ హీరోలు ఎవరు సాహసం చేయలేకపోతున్నారు. అయితే అటువంటి సాహసం చాల సులువుగా బయట హీరోలు చేస్తూ ఉండటంతో మెగా యంగ్ హీరోలు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్.

చిరంజీవిని మెగా స్టార్ గా మార్చిన 'గ్యాంగ్ లీడర్' టైటిల్ ముట్టుకోవడానికే చరణ్ భయపడిపోయాడు. అయితే ఎటువంటి భయం లేకుండా నాని ఆ టైటిల్ ను వాడుకుంటున్నాడు. ఈ విషయమై నాని పై సెటైర్లు పడ్డా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఇప్పటి వరకు చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడ లేని బెల్లంకొండ శ్రీను కూడ చిరంజీవి సినిమా టైటిల్ పై కన్నేశాడు.


తెలుస్తున్న సమాచారం మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోయే లేటెస్ట్ మూవీకి 'రాక్షసుడు' అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ టైటిల్ తో గతంలో చిరంజీవితో ఒక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇలా చిరంజీవి టైటిల్స్ అన్నీ అన్యాక్రాంతం అవ్వడం మెగా యంగ్ హీరోలకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్.

ఇప్పటివరకు చిరంజీవి పాటలను రీమిక్స్ చేస్తూ హడావిడి చేసిన సాయి ధరమ్ తేజ్ కూడ చిరంజీవి ఇమేజ్ నుండి బయటకు రావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎలాంటి భయం జంకు లేకుండా యంగ్ హీరోలు చిరంజీవి టైటిల్స్ ను కబ్జా చేస్తున్న నేపధ్యంలో తాము చిరంజీవి టైటిల్స్ విషయంలో వ్యూహాత్మక తప్పు చేస్తున్నామా అన్న అంతర్మధనంలో ప్రస్తుతం చాలామంది మెగా యంగ్ హీరోలు ఉన్నట్లు సమాచారం..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com