రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగింపు.. ఈలోపే..
- April 08, 2019
ప్రచారానికి మరో కొన్ని గంటలే మిగిలి ఉంది. అవును ప్రచారానికి మిగిలి ఉంది 41 గంటలు మాత్రమే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రోజులు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి ప్రధాన పార్టీలు. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుండడంతో…ఈలోపే మిగిలిపోయి ఉన్న నియోజకవర్గాలను చుట్టేసేందుకు రెడీ అయ్యారు ఆయా పార్టీల అధినేతలు. ఇక పలు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. క్యాంపెయిన్లో వేగం పెంచారు.
రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారాన్ని ముగించాలి. సరిగ్గా ఐదు గంటలకు మైకులకు తాళాలు పడతాయి. మరోవైపు పోలింగ్ రోజు…అంతకంటే ముందు రోజు పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వొద్దని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ కొన్ని గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు నేతలు. మిగిలినా గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఇవాళ, రేపు అగ్రనేతల పర్యటనలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రచారం మరింత వేడెక్కనుంది. ఐదారు సభలతో అధినేతలు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మరోవైపు జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. దీంతో పొలిటికల్ క్యాంపెయిన్ మరింత హీటెక్కనుంది.
ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈవీఎంలు అన్ని నియోజకవర్గాలకు చేరాయి. మరోవైపు పోలింగ్ సమయం దగ్గర పడడంతో సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలను మోహరిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







