రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగింపు.. ఈలోపే..

- April 08, 2019 , by Maagulf
రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగింపు.. ఈలోపే..

ప్రచారానికి మరో కొన్ని గంటలే మిగిలి ఉంది. అవును ప్రచారానికి మిగిలి ఉంది 41 గంటలు మాత్రమే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రోజులు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి ప్రధాన పార్టీలు. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుండడంతో…ఈలోపే మిగిలిపోయి ఉన్న నియోజకవర్గాలను చుట్టేసేందుకు రెడీ అయ్యారు ఆయా పార్టీల అధినేతలు. ఇక పలు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. క్యాంపెయిన్‌లో వేగం పెంచారు.
 
రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారాన్ని ముగించాలి. సరిగ్గా ఐదు గంటలకు మైకులకు తాళాలు పడతాయి. మరోవైపు పోలింగ్‌ రోజు…అంతకంటే ముందు రోజు పేపర్‌ ప్రకటనలు కూడా ఇవ్వొద్దని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ కొన్ని గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు నేతలు. మిగిలినా గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

ఇవాళ, రేపు అగ్రనేతల పర్యటనలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రచారం మరింత వేడెక్కనుంది. ఐదారు సభలతో అధినేతలు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మరోవైపు జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. దీంతో పొలిటికల్ క్యాంపెయిన్‌ మరింత హీటెక్కనుంది.

ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరుగుతుంది. మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈవీఎంలు అన్ని నియోజకవర్గాలకు చేరాయి. మరోవైపు పోలింగ్ సమయం దగ్గర పడడంతో సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలను మోహరిస్తున్నారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com