సివిల్స్ ర్యాంక్ సాధించిన కండక్టర్ కూతురు
- April 08, 2019
హైదరాబాద్:తండ్రి బస్సు కండక్టర్, దిగువ మధ్య తరగతి కుటుంబం.అయితేనేమి తన లక్ష్యానికి అవేమీ అడ్డు రాలేదు. ఎలాంటి కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 233వ ర్యాంకు సాధించింది. ఎల్బీ నగర్‌కు చెందిన పెద్దిటి ధాత్రిరెడ్డి ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించింది. సాధించాలనే లక్ష్యం, తపన, కష్టపడె తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించింది. యాదాద్రి జిల్లాకు చెందిన పెద్దిటి కృష్ణారెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా ఎల్బీనగర్‌లో స్థిరపడ్డారు. కూతురు ధాత్రిరెడ్డి చిన్నతనం నుంచి చదువులో టాపర్. ప్రముఖ విద్యాసంస్ధ ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. అనంతరం డచ్ బ్యాంకు-ఢిల్లీ శాఖలో ఉద్యోగం సాధించింది. కానీ అంతటితో ఆగిపోలేదు. తన సివిల్స్ కలను సాకారం చేసుకోవాలనుకుంది.9 నెలల క్రితం ఉద్యోగానికి సెలవుపెట్టి పరీక్షకు సన్నద్ధమైంది. చివరకు తన కల నిజం చేసుకుంది. సివిల్స్‌లో 233వ ర్యాంకు సాధించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







