దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి వినూత్న ప్రయోగం
- April 08, 2019
విభిన్న చిత్రాల్ని తెరకెక్కిస్తూ ప్రేక్షుల మన్ననల్ని అందుకుంటోన్న విలక్షణ దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అప్పుడే షురూ అయ్యింది. ప్రస్తుత ఎన్నికల సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని తనదైన స్టయిల్లో సరికొత్తగా సినిమా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముగ్గురు యువతులు తమ ఫేస్‌ని పూర్తిగా కన్పించనీయకుండా చేస్తూ, ఆయా రాజకీయ పార్టీల్ని పరోక్షంగా ప్రమోట్ చేస్తున్న పోస్టర్‌ని రూపొందించి వదిలారు.ఏ.పి,తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. 18 ఏళ్ళు దాటినవారంతా ఓటు వేయడానికి అర్హులు, అలాగే మా సినిమా చూడటానికి కూడా.. అంటూ వినూత్నంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడం ద్వారా సినిమాకి మంచి పబ్లిసిటీ లభిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత బాధ్యతాయుతమైన పనో తెలియజేస్తూనే సినిమా ప్రమోషన్స్‌కి ఎన్నికల సీజన్‌ని వాడుకోవాలనే ఆలోచన చేసిన సునీల్ కుమార్‌రెడ్డిని అభినందించాలి ప్రతి ఒక్కరూ. ఈ సినిమాకి మా గల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







