ఏపీ లో రిలీజ్ అవ్వనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
- April 10, 2019
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'మొదటి నుంచి ఎన్నో వివాదాలు సృష్టిస్తూ వచ్చింది. ఈ సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు ను విమర్శించేలా ఉందని ఒక వర్గం వారు పోలీసు కేసులు పెట్టడం..కోర్టు మెట్లక్కడం ఎన్నో రకాలుగా మూవీ రిలీజ్ ఆపే ప్రయత్నం చేశారు. ఈ మూవీ గత నెల 29 ఒక్క ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. ఇక తెలంగాణాలో సినిమా రిలీజ్ అవటంతో...బాగుందని టాక్ రావటంతో ఈ మూవీపై ఆంధ్రా జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ నేపథ్యంలో పైరసీ ప్రింట్ ఎపిలో కనిపించింది..చాలా మంది వీక్షించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ఏపీలో విడుదలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఇవాళ మధ్యాహ్నం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం వీక్షించనుంది. న్యాయమూర్తుల చాంబర్‌లో న్యాయవాదుల సమక్షంలో ఈ మూవీ ప్రదర్శించనున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల అవుతుందని దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. వాదాలు, వివాదాలు, సవాళ్లు, ఒత్తిళ్లు మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండువారాల క్రితం తెలంగాణలో విడుదలైంది.
కోర్ట్ తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రిలీజ్ ఆగి పోయిన విషయం తెలిసిందే. సినిమాకు హైప్ తీసుకురావడం, చంద్రబాబుని విలన్ గా చూపటం వంటి అంశాలు వల్ల తెలంగాణలో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ తెచ్చాయి. ఏప్రియల్ 12న సినిమా రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







