ఆ బీచ్‌లో ఫోటోలు దిగారంటే అంతే సంగతులు..
- April 10, 2019
సముద్రపు అలల అందాలను వీక్షించడంతో పాటు, అందమైన అమ్మాయిల వంపు సొంపు వయ్యారాలు బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. నలుగురు కలిస్తే నాలుగు కబుర్లతో పాటు సెల్ఫీలు, ఫొటోలంటూ హడావిడి చేస్తారు. మరి బీచ్‌కి వెళ్తే చేతులు ఊరుకుంటాయా. సముద్రంలో కొట్టే కేరింతలను ఫొటోల్లో బంధించేయము. కానీ థాయ్‌ల్యాండ్ బీచ్‌లో అలా చేస్తామంటే కుదరదు. కెమెరా క్లిక్‌మనిపించిన మరుక్షణం ఎయిర్ నేవిగేషన్ అధికారులు వచ్చి పట్టుకుపోతారు. జైలుకి పంపిస్తారు కొన్ని కేసుల్లో అయితే ఉరి శిక్ష కూడా వేస్తారు.
ఇక్కడి ఎయిర్ నేవిగేషన్ చట్టం ఇంత కఠినంగా ఉండడానికి కారణం.. ఇక్కడి మాయ్ ఖావ్ బీచ్ టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పక్కనే ఈ బీచ్ ఉండడంతో పర్యాటకులు తమ చేతులకు అందే అంత ఎత్తులో వెళుతున్న విమానాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు. ల్యాండింగ్ అయ్యే విమానాలు అత్యంత దగ్గరగా వెళుతుంటాయి. దీంతో బీచ్ అందాలతో పాటు, విమానాలను దగ్గరగా వచ్చినప్పుడు ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. పర్యాటకులు ఇలా చేయడంతో కాక్‌పిట్‌లోని పైలట్లు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. పిచ్చి పిచ్చి ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగుతుంటే అవి పైలట్ల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని థాయ్ అధికారులు చెబుతున్నారు.
ఫలితంగా విమానంలోని ప్రయాణీకులు ప్రమాదం బారిన పడే అవకాశాలున్నందున ఎయిర్ నేవిగేషన్ అధికారులు పర్యాటకుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపై ఇలా ఫోటోలు తీసుకుంటే థాయ్ పోలీసులు జైల్లో పెడతారు. ఎయిర్‌పోర్టు చుట్టూ 9 కిలోమీటర్ల ఎక్స్‌క్లూజివ్ జోన్ ప్రకటించారు. ఎవరైనా ఈ జోన్ పరిథిలో డ్రోన్స్ ఎగురవేసినా, లేజర్ లైట్లు వేసినా, ఫొటోలు తీసుకున్నా జైలుకు పంపుతారు. కొన్ని కేసుల్లో అయితే ఉరిశిక్ష కూడా అమలు పరిచే అవకాశాలు ఉంటాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







