తెరపైకి మరో పొలిటికల్ లీడర్ బయోపిక్
- April 10, 2019
మరో పొలిటికల్ లీడర్ బయోపిక్ తెరకెక్కుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై బయో పిక్ రూపొందుతోంది. ఈ సినిమాకు శశిలలిత అని పేరు పెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ లను రిలీజ్ చేశారు.
వివాదాస్పద దర్శక-నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. శశిలలిత పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందన్నారు. జయ జీవితంలోని కీలకమైన అంశాలతో సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్తామని కేతిరెడ్డి తెలిపారు.
లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా పేరుతో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వార్తల్లోకి వచ్చారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు పోటీగా లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడేమో జయలలిత జీవితకథ ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







