ముగిసిన బేబీ గేమ్స్
- April 17, 2019
రెండవ బహ్రెయిన్ బేబీ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. రిఫ్ఫాలోని ఇసా స్పోర్ట్స్ సిటీ బహ్రెయిన్ వాలీబాల్ అసోసియేషన్ హాల్‌లో ఈ వేడుకలు జరిగాయి. చిన్నారుల ఆటపాటల్ని తిలకించేందుకు వారి పేరెంట్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజేతలకు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ రిప్రెజెంటేటివ్స్ మెడల్స్ అందించారు. బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్, ఫుట్ బాల్ మరియు జిమ్నాస్టిక్ వంటి విభాగాల్లో పోటీలు జరిగాయి. ఒలింపిక్స్ ముగింపు సందర్భంగా టార్చ్ ఫ్లేమ్ కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారని, వారికి కోచ్‌లు మంచి శిక్షణ ఇచ్చారనీ, 3 నుంచి 5 ఏళ్ళ మధ్య చిన్నారులు పోటీల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







