దాడులు జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలతో యూరప్‌లో
- December 31, 2015
నూతన వసంతాన్ని ఆనందోత్సాహాల మధ్య స్వాగతించాల్సింది పోయి.. యూరప్‌లో పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడుల హెచ్చరికలతో నేపథ్యంలో ఆంక్షలతో వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఫ్రాన్స్, అమెరికాలలో జరిగిన ఉగ్రవాద దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలతో యూరప్‌లోని పలు నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అధికారులు అప్రమత్తమయ్యారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఉగ్రదాడుల హెచ్చరికలతో పెద్ద ఎత్తున నిర్వహించే సంబరాలను రద్దు చేశారు. అలాగే పారిస్, లండన్, బెర్లిన్, మాస్కో నగరాల్లో వేడుకలు నిర్వహించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. టర్కీలోని అంకారాలో ఉగ్రవాద దాడిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







