తమిళనాడు పోలింగ్.. ఓటేసిన సినీ ప్రముఖులు
- April 18, 2019
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు (గురువారం) ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖులు కూడా ఓటేసేందుకు క్యూ కట్టారు. తమిళ ప్రముఖ నటులు సూర్య, కార్తి, జ్యోతిక క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సూపర్‌స్టార్ రజినీకాంత్ ఓటేసేందుకు ముంబై నుంచి తమిళనాడు వచ్చారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, విశ్వనటుడు కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలోని ఆల్వార్‌పేటలో క్యూలో నిలుచుని ఓటేశారు. ఇక, తమిళ స్టార్ హీరో అజిత్, ఆయన భార్య షాలినీ, మరో స్టార్ హీరో విజయ్, `బిచ్చగాడు` హీరో విజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







