సోలార్ ప్యానెల్ సామర్ధ్యాన్ని పెంచే రోబోని కనిపెట్టిన సౌదీ విద్యార్థులు
- April 22, 2019టైఫ్: సౌదీ అరేబియాలోని టైఫ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఓ రోబోని తయారు చేశారు. ఈ రోబో, సోలార్ ప్యానెల్స్ సామర్థ్యాన్ని 14 శాతం వరకు పెంచుతాయి. సోలార్ ప్యానెల్స్‌ని క్లీన్‌గా, డస్ట్ ఫ్రీగా వుంచడమే ఈ రోబో చేసే పని. అహ్మద్ ఫయాజ్ అహ్మద్ మొహమ్మద్, అహ్మద్ అలి జాయెద్ ఔధా ఈ రోబోని యతారు చేశారు. ఈ ఇద్దరూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము పేరుకుపోవడం ద్వారా వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ సమస్యకు రోబో ద్వారా పరిష్కారం కనుగొన్నారు ఈ విద్యార్థులు. హై పెర్ఫామెన్స్, కాస్ట్ ఎఫీషియంట్ స్మార్ట్ రోబోని తయారు చేసిన ఈ విద్యార్థులు అందరి మన్ననలూ అందుకుంటున్నారు. రోబోకి అమర్చిన ప్రత్యేక సెన్సార్ల ద్వారా ప్యానెల్స్ సర్ఫేస్పై వున్న దుమ్ము, ధూళిని సమర్థవంతంగా తొలగించడానికి వీలవుతుంది. ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ మొహమ్మద్ సలాహుద్దీన్ మొహమ్మద్ సులేమాన్ మరియు డాక్టర్ ముస్లెహ్ అల్ హార్తి పర్యవేక్షణలో విద్యార్థులు ఈ రోబోని తయారు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా