రూ. 50 వేల పరిమితి దాటితే పాన్
- December 31, 2015
నల్లధనం చెలామణిని నియంత్రించడంతో పాటు మరింతమందిని పన్ను పరిధిలోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, పరిమితికి మించిన లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) నమోదును నేటినుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిమితికి మించిన లావాదేవీ నిర్వహిస్తూ, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇవ్వకపోయినా, తప్పుడు ధ్రువీకరణ ఇచ్చినా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధించే నిబంధన శుక్రవారం (జనవరి 1) నుంచి అమల్లోకి వస్తోంది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. పాన్ నమోదు తప్పనిసరి అయిన లావాదేవీ నిర్వహిస్తున్న వ్యక్తికి పాన్ లేకపోతే, ఫారం సంఖ్య 60ని పూరించడం తప్పనిసరి అవుతుందని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పేరు, చిరునామా, పుట్టినరోజు, మొబైల్ నెంబరు వంటి వ్యక్తిగత వివరాలు పూరించి, ఆధార్, ఫోటో ఓటర్ కార్డు వంటి వ్యక్తిగతనివాస ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. లావాదేవీ నగదు, చెక్కు, కార్డు, డ్రాఫ్ట్, బ్యాంకర్ చెక్, ఆన్‌లైన్ లావాదేవీ.. ఇలా ఏ పద్ధతిలో చేశారో నమోదు చేయాలి. ఆధార్ లేకపోతే, ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన సంఖ్యను నమోదు చేసే అవకాశాన్నీ ఫారం 60లో కల్పించారు. లావాదేవీ నిర్వహించిన వ్యక్తి వార్షిక వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో కనుక తప్పుడు వివరాలు వెల్లడిస్తే, ఐటీ చట్టంలోని 277 సెక్షన్ కింద విచారిస్తారు. ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షజరిమానా విధించే అవకాశం ఉంది. ఐటీ చట్టాల ప్రకారం కనీస శిక్షగా 3 నెలల కఠిన కారాగారం భరించాల్సి ఉంటుంది. ఫారం 60లో తప్పుడు వివరాల నమోదు ద్వారా రూ.25 లక్షలకు మించి పన్నును ఎగవేస్తే, 6 నెలల నుంచి ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్షణ, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.25 లక్షల కన్నా తక్కువ పన్నును ఎగవేసినట్లు నిర్థారణ అయితే 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, జరిమానా భరించాల్సి ఉంటుంది. రూ.50,000 మించిన క్యాష్‌కార్డులు/ప్రీపెయిడ్ కార్డుల కోసం నగదు చెల్లించినా.. హోటల్ బిల్లు, విదేశీ ప్రయాణ టికెట్ల కొనుగోలుకు నగదు రూపేణ రూ.50,000కు మించి చెల్లించేందుకు.. స్టాక్‌ఎక్స్ఛేంజీలలో నమోదైన కంపెనీల షేర్లు రూ.50,000, అంతకుమించి విలువైనవి కొనుగోలు చేసినా.. నమోదు కాని కంపెనీలలో రూ.లక్ష, అంతకుమించిన విలువైన షేర్లు కొనుగోలు చేసినా.. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో ఒకసారి రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేయాలన్నా, ఒక ఏడాదిలో చేసిన డిపాజిట్లు రూ.5 లక్షలకు మించినా.. బ్యాంకు డ్రాఫ్ట్, పేఆర్డరు, బ్యాంకర్స్ చెక్ వంటివి కొనుగోలుకు ఒకరోజులో రూ.50,000కు మించి చెల్లించినా.. ఏడాది వ్యవధిలో జీవితబీమా ప్రీమియం కోసం రూ.50,000 చెల్లిస్తున్నా.. రూ.2 లక్షలకు మించిన విలువైన బంగారు ఆభరణాలను నగదు, కార్డు ద్వారా కొనుగోలు చేసినా.. రూ.10లక్షలకు మించి విలువైన స్థిరాస్తి కొనుగోలు చేయాలన్నా.. బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకూ నేటి నుంచి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) నమోదు తప్పనిసరి చేశారు. అయితే ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద ప్రారంభించే ఖాతాలకు మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







