శ్రీలంక:ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్న బిలియనీర్

- April 22, 2019 , by Maagulf
శ్రీలంక:ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్న బిలియనీర్

శ్రీలంకలో జరిగిన మరణహోమం చాలా మంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ పేలుళ్ళు డెన్మార్క్‌కు చెందిన బిలియనీర్ ఇంట్లో తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ పేలుళ్లలో ఆయన పిల్లల్లో ముగ్గురు మరణించారు. ఈస్టర్ సందర్భంగా అసోస్‌ యజమాని ఆండర్స్‌ హోల్చ్‌ పోల్సెన్‌ కుటుంబం శ్రీలంకలో పర్యటిస్తోంది.  ఈ క్రమంలో ఆదివారం వారు రెస్టారెంట్‌లో ఉన్న సమయంలో బాంబు పేలుళ్ళు సంభవించాయి.

ఈ బాంబు దాడిలో ఆండర్స్‌ ముగ్గురు పిల్లలు బలయ్యారు. అయితే ఆ ఘటనకు సంబంధించి ఆండర్స్‌ కుటుంబం ఎలాంటి ప్రకటన చేయలేదు. చనిపోయిన ముగ్గురు పిల్లల పేర్లను కూడా బయటపెట్టలేదు. ఇంటర్‌నేషనల్ టెక్స్ట్ టైల్ బ్రాండ్ సంస్ధకు బెస్ట్ సెల్లర్‌కు పోల్సెస్‌ అధినేత. అలాగే 11 స్కాటిష్‌ ఎస్టేట్లు, ఒక క్యాజిల్ ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. అంతేకాక అలాగే అసోస్‌లో ఏకైక అదిపెద్ద షేర్ హోల్డర్‌. యుకేలో రీయల్ ఎస్టేటర్‌గా ఆండర్స్‌ పేరుంది. ఈ ఘటనలో 290 మంది మృతి చెందగా..500 మందికి పైగా గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com