ఇంత నిర్లక్ష్యమా.. అరబిక్ రాస్తే.. ఉర్దూ రాసినట్లు ఇచ్చారు..
- April 23, 2019
తెలంగాణ:విద్యార్థుల ఉద్రేకం..తల్లిదండ్రుల శాపనార్థాలు.. విద్యార్ధి సంఘాల ముట్టడితో నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు అట్టుడికిపోయింది. అదికారుల చేసిన తప్పిదాలు విద్యార్థుల పట్ల శాపంగా మారాయి. తాజాగా దీనికి సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండకు చెందిన ఎండీ.నౌషిన్ హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2018లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అయితే ఆమె ఈ ఏడాది మార్చిలో మెడిసిన్ సీటు కోసం అరబిక్ పేపర్ – 1, 2 పరీక్షలు (ఎక్స్‌టర్నల్ లాంగ్వేజ్) రాశారు. ఇంటర్ బోర్డు ఇలవలే విడుదల చేసిన ఫలితాల్లొ ఆమెకు ఉర్దూ పేపర్-1, 2 రాసినట్లు.. వాటిలోనూ సున్నా మార్కులు వచ్చినట్లు ఉంది. దీంతో నౌషిన్ నివ్వెరపోయారు. రాసింది ఆరబిక్ పేపరైతే ఉర్ధూ పేపర్ రాసినట్లుగా రావడం ఏంటని నౌషిన్ ప్రశ్నించారు. తనకు కనీసం 90 మార్కులు వస్తాయని భావించనాని కానీ వచ్చిన మార్కులు చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రస్తుతం రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయం గురించి గత రెండు రోజులుగా కుటుంబసభ్యులతో కలిసి బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని వాపోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







