'దబాంగ్3'లో ఖాన్ దోస్తులు
- April 23, 2019
కొరియోగ్రాఫర్..నటుడు..దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇండోర్ షెడ్యూల్ ని ముగించుకుని ముంబైకి పయనమైంది. తదుపరి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరణ సాగనుందని తెలుస్తోంది. అక్కడే సల్మాన్ - షారూక్ కాంబినేషన్ సన్నివేశాల్నితెరకెక్కించనున్నారట. ఒకట్రెండు రోజుల పాటు ఇద్దరిపై సీన్ల చిత్రీకరణ సాగుతుందిట. సల్మాన్ సినిమాలో షారూక్ చేసే పాత్ర ఎలాంటిది.. అంటే అతడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇస్తాడట. ఒక ధారావి లాంటి ఏరియాలో రాబిన్ హుడ్ లా సల్మాన్ జర్నీ సాగడంలో షారుక్ సాయం అందిస్తాడట. అంటే సల్మాన్ పాత్రకు సహాయక పాత్రగా షారూక్ కనిపిస్తాడు. కొందరు హీరోల పేర్లు పరిశీలించిన తర్వాత చివరికి ఆ పాత్రలో షారూక్ అయితేనే బావుంటుందని దర్శక..హీరో భావించారట. దానికి షారూక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జీరో ఫ్లాప్ అయిన తర్వాత షారూక్ కి సినిమాలేవీ లేవు. ప్రస్తుతం అతడు కెరీర్ పరంగా సందిగ్ధతలోనే ఉన్నాడు.
ఇలాంటి టైమ్ లో భాయ్ ఫోన్ చేయగానే వెంటనే ఓకే చెప్పాడట. ఇక 2019లో షారూక్ ఏ సినిమాలోనూ నటించడం లేదు కాబట్టి `దబాంగ్ 3`లో మాత్రమే అభిమానులు చూసుకుని సంతృప్తి పడాల్సిందే. ఇటీవలే భరత్ ట్రైలర్ చూసి షారూక్ వెంటనే సల్మాన్ కి శుభాకాంక్షలు తెలిపాడు. ట్రైలర్ ఎంతో బావుందని ప్రశంసించాడు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







