హీరో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా టీజర్ రిలీజ్
- December 31, 2015
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్న సాయి, 2016లోనూ అదే జోరు కొనసాగించడానికి ట్రై చేస్తున్నాడు. మెగా ఇమేజ్ కు తగ్గ మాస్ కథతో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. అందుకే కొత్త సంవత్సరం కానుకగా తన కొత్త సినిమాను టీజర్ ను అభిమానులకు గిఫ్ట్ గా అందించాడు. ఫుల్ ఎనర్జీతో నిండిన ఈ టీజర్ మెగా అభిమానులను ఖుషి చేస్తోంది.సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంతో సుప్రీమ్ సినిమాలో నటిస్తున్నాడు. మామయ్య చిరంజీవి స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఉన్న ట్యాగ్ ను ఇప్పుడు తను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు.ఇప్పటికే మాస్ లుక్స్ తో పాటు కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్న సాయి మరోసారి తన మార్క్ చూపిస్తున్నాడని భావిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన టీజర్ తోనే అదే సిగ్నల్స్ ఇచ్చాడు. స్టైలిష్ యాక్షన్ సీక్వన్స్ లతో రూపొందిన సుప్రీమ్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







