శివకార్తికేయన్ ఓటేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం
- April 24, 2019
ఓటరు జాబితాలో పేరు లేకున్నా.. తమిళ నటుడు శివకార్తికేయన్ ఓటేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడులో ఈనెల 18న రెండో దశ పోలింగ్ జరిగింది. ఓటు వేసేందుకు నటుడు శివకార్తికేయన్ దంపతులు వలసరవక్కంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటరు జాబితాలో కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఉంది.. కార్తి కేయన్ పేరు మాత్రం గల్లంతైంది. అయినా ఓటేశారు.
అయితే దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ప్రత్యేక అనుమతి తీసుకుని ఓటు వేశానని చెప్పి వెళ్లిపోయారు శివకార్తికేయన్ . అనంతరం, వేలికి సిరా ఉన్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు . ఇది కాస్త సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఎలా ఓటు వేశారంటూ ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అక్కడి పోలింగ్ కేంద్రం అధికారుల తప్పిదమే అంటూ.. వారిపై చర్యలకు ఆదేశింశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..