శ్రీలంక ఫ్లాగ్‌ రంగులతో అబుధాబిలోని ప్రముఖ భవనాల వెలుగులు

- April 25, 2019 , by Maagulf
శ్రీలంక ఫ్లాగ్‌ రంగులతో అబుధాబిలోని ప్రముఖ భవనాల వెలుగులు

అబుధాబి:శ్రీలంకలో తీవ్రవాద దాడుల్లో బలైపోయినవారికి సంతాప సూచకంగా అలాగే బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, శ్రీలంక సమాజానికి మద్దతుగా అబుదాబీలోని ప్రముఖ నిర్మాణాలకు శ్రీలంక జెండాలోని రంగులతో వెలుగులు నింపారు. ఎమిరేట్స్‌ ప్యాలెస్‌, షేక్‌ జాయెద్‌ బ్రిడ్జి, అడ్‌నాక్‌ బిల్డింగ్‌, క్యాపిటల్‌ గేట్‌ వంటి భవనాలు శ్రీలంక ఫ్లాగ్‌లోని రంగుతో నిండిపోయేలా లైటింగ్‌ని అమర్చారు. ఇదిలా వుంటే అధికారిక వివరాల ప్రకారం శ్రీలంక పేలుళ్ళలో మృతుల సంఖ్య 350కి పైగా నమోదయిన సంగతి తెల్సిందే. ఇప్పటికే యూఏఈ పాలకులు, శ్రీలంకపై తీవ్రవాద దాడిని ఖండించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com